మన పవిత్ర భారతదేశం ఎన్నో దివ్య క్షేత్రాలకి పుణ్య తీర్ధాలకి నిలయం. ఈ విద్య భూమిలో యందరో దేవతలు తమ తమ అంశలని నిలిపి, ఈ ధరిత్రిని పవిత్రం చేసారు. మన దేశంలో వివిధ దేవతలకి సంబంధించిన వివిధ పుణ్యక్షేత్రాలు వున్నాయి. అయితే వీటిలో శక్తి ప్రాధాన్ క్షేత్రాలుగా అష్టాదశ శక్తి పీఠాలు 52 ఉపశక్తి శక్తి పీఠాలు 108 శక్తి పీఠాలు ఏంతో విశిష్టత సంతరించు కున్నాయి. సష్టి , స్థితి లయకారిణి అయిన ఆ ఆదిపరాశక్తి అంశాలు ఈ శక్తి పీఠాలలో కొలువు వుండటం వలన వీటి మహత్యం ప్రధానమైనది. ఎంతో గొప్పదిగా పురాణాలు చెబుతాయి. ఈ మహాశక్తి శక్తి పీఠాలు లలో అత్యంత ప్రధానమైనవి అష్టాదశ శక్తి పీఠాలు. పూర్వం దక్షయజ్ఞ సమయంలో తండ్రి చేత అవమానించబడ్డ పార్వతీ దేవి యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని త్యజించగా , దేవి శరీరాన్ని భుజంపై వేసుకున్న శివుడు ఉన్మత్తుడై ప్రళయతాండవం చేయసాగాడు. అప్పుడు విష్ణుమూర్తి దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండించగా ఆ శరీరం నుంచి వెలువడిన భాగాలు భూమి మీద వివిధ ప్రాంతాలలో పడ్డాయి. అలా పడిన ప్రదేశాలలో సతీదేవి శరీరంలోని ముఖ్యమైన భాగాలు పడిన ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలు గా విఖ్యాతి పొందగా, మిగిలిన భాగాలు పడిన ప్రదేశాలు 52 శక్తి పీఠాలుగా, 108 శక్తి శేత్రాలుగా సుప్రసిద్దమయ్యాయి అయితే చాలా మంది అంగీకరించిన ప్రాంతాల్ని ఈ గ్రంధంలో పొందుపరిచాం. వీటితో పాటు 51 శక్తి పీఠాల స్థానాలని 108 శక్తి పీఠాల అధిష్టాన దేవతల పేర్లు తో మత్స్య పురాణంలో చెప్పబడిన అష్టోతర శతనామావళిణి శీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని కూడా ఈ గ్రంధంలో మీకు అందిస్తున్నాం.
Rs.40.00
In Stock
-
+