అది అపురూపమైన దృశ్యం. 40,000 మంది పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నాసిక్ నుంచి ముంబాయి వరకూ 200 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్ళారు. వారు నగరం దృష్టిని ఆకర్షించారు. ఎంతో కాలం దాని స్మృతిపథంలో నిలిచి ఉండే దృశ్యాన్ని అందించారు. వారు ఎంతో బలమైన ప్రతికూలతలను అధిగమించారు. వారు బధిరులు వినేలా, అంధులు చూసేలా చేశారు.
ఈ పుస్తకం మన కాలంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన పోరాటాల్లో ఒకదాన్ని అక్షరీకరించింది. అదే ప్రజల కంటే కూడా డబ్బుకే ఎక్కువగా కట్టుబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు జరిపిన పోరాటం. ఇది ఎలా సంభవించింది? దానికి దారి తీసిన కారణాలేమిటి? ఇంత అసాధారణమైన క్రమశిక్షణాయుత, ప్రజాతంత్రయుత, స్వాభిమానపూర్వకమైన ప్రదర్శనను నిర్వహించేందుకు ఆలిండియా కిసాన్ సభ ఎంత శ్రమపడి ఉంటుంది?
ఈ పాదయాత్రకు కారకులైన నాయకుల్లో ఒకరైన అశోక్ ధావలే సవివరమైన వ్యాసం వ్రాశారు. దాన్ని ఆయన విశ్లేషణాత్మకంగానే గాక పాదయాత్రకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎంతో చక్కగా వివరించారు. సుధాన్వ దేశ్పాండే చివరి మాటలో ఈ పాదయాత్రను సాకారం చేసిన నిర్వాహకుల్లో కొందరి వ్యక్తిత్వ వివరణ ఉంది. ఈ చిన్న, పఠనీయంగా ఉన్న పుస్తకంలో విభ్రాంతిగొలిపే ఫోటోలను ముద్రించడం జరిగింది. ఇంకా ఇందులో గత మూడు దశాబ్దాలుగా వ్యవసాయ పరిస్థితులు, గ్రామీణ దుస్థితిని వివరిస్తూ వస్తున్న ప్రముఖ చరిత్రకారుడు పి సాయినాథ్ ముందుమాట కూడా ఉంది.
పేజీలు : 63