మా గ్రామంలో శ్రీ కుసుమ హరనాధ భక మండలి మహబూబ్ నార్ జిల్లలోనే గాక ఇతర జిల్లాలలోను గడిచిన 35 సంవత్సరాలనుండి భగవన్నామ సంకీర్తనలు ప్రచారముల చేయుచు ప్రఖ్యాత మైనది. ఈ విధమైన కార్యక్రమములందు సమధికోత్సాహంతో పాల్గొను నేను దైవానుగ్రాము వలన అనేక స్థలాలలో భాగావల్లీలలను , గుణసంకీర్తనాడులను గూర్చి వినిపించుచుంటిని.
ఈ పద్దతి నయు ఆనందం కలిగి శాంతిని చేకూర్చుటవలన మరింత అధికంగా భక్తుల చరిత్రలను వివిధ స్థలాల నుండి తెప్పించుకొని పాటించినాను . ఈ సందర్భంగా శ్రీ రామాయణంలో హనుమద్వాశిష్టతను, పరాక్రమాది కథలను అట్లే భారత భాగవత విశ్లేషాలను గ్రహించుటతోపాటు పండరి భక్తుల చరిత్రలను, మహనీయుల సూక్తిముక్తావళిని అవగాహన చేసుకున్నాను. వీని యన్నిటి పాఠన  ప్రవచన రూప ఫలమే ఈ గ్రంధము.
ఈ విధమైన ఎన్నో మహిమలు , మహనీయుల మహితోక్తి విశేషములను తెల్పుటకు నేను చేసిన ప్రయత్నంలో ఇదొక భాగము.
పెద్దలకే కాక బాలురకు కూడా అవగాహన కావలేనాను భావనతో సులభశైలి , విషయ సంక్లిష్టతను అవలంభించినారు. ఈ విధమైన పవిత్ర భావనా ప్రేరకముగా నేను దైర్యము చేసి సర్వము దైవాదీనమను పట్టుదలతో గ్రంధ రచన మొనర్చితిని. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good