మహనీయుల మహాత్ముల చరిత్రలు పాఠ్యాంశాలలో ఉంటే కొంత మార్గదర్శనం లభిస్తుంది. పూర్వపురోజులలో హైస్కూల్‌ లెవెల్‌లో మోరల్‌ క్లాసు అని ఒకటి ఉండేది. అందులో నీతికథలు, శతకపద్యాలు, రామాయణ భారతాది ఉద్గ్రంథాలలోని కథలు గాథలు చెప్పేవారు. నిర్థిష్టమైన సిలబస్‌ పరీక్ష రాసి పాసు కావలసిన అగత్యం లేకపోయినా జీవితంలో పాసుకావటానికి ఉపయోగపడేవి. ఇప్పుడవి మృగ్యం.

ఈలాంటి మహనీయుల చరిత్రలు తెలుసుకోవడం వల్ల వారి విజయ ప్రస్థానం వెనుక గల శ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం లాంటి లక్షలణాలు కొంతవరకు అవగతం అవుతాయి. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను అధిగమించిన తర్వాత లభించిన విజయగాథ అని అర్థమౌతుంది.

ఈ నేపథ్యంలో ఒక చిన్న ప్రయత్నంగా ఈ గ్రంథం వెలువడుతున్నది. ఈ వ్యాసాలన్నీ గత ఏడెనిమిది సంవత్సరాలలో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య, శ్రీ శంకర కృప, దర్శనం వంటి పత్రికలు కొందరు మహాత్ముల శతజయంతి, షట్యబ్దిపూర్తి, పీఠాధిపత్య ఉత్సవాలు లాంఇ సందర్భాలలో వెలువడిన ప్రత్యేక సంచికలలో ప్రచురించబడినవి.

పేజీలు : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good