ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్తూ...
ఆ ప్రయత్నంలో వెలువడిందే ఈ ''శ్రీశ్రీ-101'' విశేష సంచిక. ఇది మహాకవి శ్రీశ్రీ ప్రత్యేకం. 1/4 డెమ్మీ సైజులో మల్టీ కలర్ అపురూప బాపు ముఖ చిత్రంతో, 152 పేజీలతో వెలువడిన ఈ సంచికకు మరో నూరుగురు సమర సాహితీవేత్తలు తమ కొత్త రచనలు అందించారు.
ఇంకా ఈ సంచిక వారి వారి చిత్రాలతో ప్రముఖ అమర సాహితీవేత్తలు శ్రీశ్రీపై వెలిబుచ్చిన అభిప్రాయాలూ, ప్రముఖ చిత్రకారుల శ్రీశ్రీ రేఖా చిత్రాలూ, ప్రతి రచన ముందు నినదిస్తూ మహాకవి శ్రీశ్రీ ఒక కొటేషనూ పొందుపరుచుకుంది. ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ పరంపరలో 31వది.