''జీవితాన్ని ధారపోసినంత మాత్రాన ఒకడు చరితార్ధుడు కాడు.

వీర మరణం పొందినందువల్ల అమరుడు కాడు.

    ఏ ఆదర్శం కోసం జీవితాన్ని ధారపోశాడో,

ఆ ఆదార్శపుటౌన్నత్యాన్ని బట్టి అతడు చరితార్ధుడవుతాడు'' - గురజాడ

ఇది మహాకవి గురజాడ శతవర్ధంతి సంవత్సరం. 2015 నవంబరు 30కి ఆయన కాలం చేసి సరిగ్గా నూరేళ్ళు.

ఈ పుస్తకంలోని అత్యధిక రచనలు రెండు ప్రత్యేక సంచికలలోవే అయినా, మొత్తంగా చూసినపుడు 38 సంవత్సరాలపాటుగా నడుస్తున్న పత్రికలో అనేకానేక సందర్భాలలో ప్రచురించినవి ఒకే చోట కలిపి వేస్తూండటంచేత పునరుక్తి దోషాలుంటాయి. తెలుగునాట మరే సాహిత్య పత్రికలోనూ వెలువడనన్ని రచయితల రచనలు ఉండటంచేత, ఈ విస్తృత రూపాన్ని కూడా చూడటం అవసరమేననిపించి వాటినన్నింటిని ఒకే సంపుటిగా తెస్తున్నాం. వీటిలో గురజాడను బముముఖకోణాలలో అవగాహన చేసుకోవాల్సిన విశ్లేషణాత్మక రచనలున్నాయి. వర్తమానానికి అన్వయించుకోవాల్సిన వ్యాఖ్యానాలున్నాయి. దేశీయ, ప్రపంచస్థాయిలో ఆయన విశిష్టతను తెలియచేసే రచనలున్నాయి. గురజాడకాలపు చారిత్రక పరిమిత ప్రతిబింబించిన ఆయన రచనలపై విమర్శలున్నాయి. ఆయా కాలాలలో చౌకబారు విమర్శలు చేసినవారికి జవాబులూ, వివిధ కవుల స్పందనలూ, అనేకమంది ప్రసిద్ధుల రచనలూ, విశిష్ట పునర్ముద్రణలూ...వెరసి ఇందులో చాలా వున్నాయి.

- జనసాహితి

Write a review

Note: HTML is not translated!
Bad           Good