మహాభారతం పంచమవేదము. ఈ గ్రంథమునకు 'జయ'మని పేరు. అనగా మానవునకు ధర్మార్ధ కామమోక్ష ప్రయత్నము నందు జయము కూర్చు జీవన విధానము ఇందు ప్రతిపాదింపబడినది. నారాయణుని, నరుని, వ్యాసుని, సరస్వతీ దేవతను స్తుతించి ఈ గ్రంథము పఠించువారికి ఇందలి రహస్యములు పరిచయములగును.
భారతము నందలి పర్వములు 18, భారత సంగ్రామము 18 దినములు జరిగినది. అందు 18 అక్షౌహిణులసేన పాల్గొనినది. మహాభారతము నందలి గీతాసందేశము 18 అధ్యాయములు, అందు పాల్గొనిని మహావీరులు 18 మంది, ఈ విధంగా 18 సంఖ్యకు ప్రాధాన్యమివ్వబడినది.
మార్పు చెందనివి, నశించనివి, శాశ్వతమైనవి యగు 18 సృష్టి ధర్మములను ప్రకటనము చేయుటకు చేసిన వ్యాసభగవానుని ప్రయత్నమే శ్రీ మహాభారతము.  ఈ 18 రహస్యములును 'కృష్ణగీత' యందలి 18 అధ్యాయములలోను, మొత్తము గ్రంథమందలి 18 పర్వములలోనూ ప్రతిపాదించబడినవి. శ్రద్ధ, భక్తి, అనసూయత్వము, స్వభావంగా గల మానవునకు బుద్ధియ్గోమున ఈ రహస్యములు దర్శనము కాగలవు.
యుగ యుగముల కాలగతులను, ఆయా యుగముల యందలి మానసిక పరిపక్వతను తమ దివ్యదృష్టి ద్వారా గమనించగల ద్రష్టలే ఋషులు. ద్వాపర యుగాంతంలో వ్యాసులవారు రాబోవు కలియుగ ధర్మమును దర్శించారు. అలసులు, మందబుద్దులు, అల్పతరాయులు అయిన కలియుగ వాసులు భారతీయుల ప్రమాణ గ్రంధమైన వేదమును అర్ధము చేసికొనలేరు అని తెలుసుకొని, ఒకటిగా ఉన్న వేదమును నాలుగు భాగాలుగా విభజించారు. అష్టాదశ పురాణములు, బ్రహ్మసూత్రములు రచించారు. పాఠకుల సౌకర్యార్ధం 7 సంపసుటాలుగా అందరికీ అర్ధమయ్యే రీతిలో తెలుగున అనువదించినది శ్రీ పిలకా గణపతిశాస్త్రి గారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good