భారతంలాంటి గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో ఋజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫూటంగా కన్పిస్తుంది. నిష్ఠూరమైన సత్యాలను యథాతథంగా అందించడంవల్ల అసత్యప్రచారాలు, అభిప్రాయాలు, అవగాహనలు తలొగించడం జరిగింది. ఆధునిక విశ్లేషకులకు, భారతంపై పరిశోధన చేయదలచినవారికీ ఈ గ్రంథం ఒక ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. మూలగ్రంథంలోని సుమారు వేయిశ్లోకాలకు పైగా ఉటంకించడంవల్ల ప్రామాణికంగా ఎక్కడ ఏం చెప్పబడిందో అవగత మవుతుంది. ముఖ్యంగా విదురనీతి, రాజనీతిధర్మాలు మొదలైన సందర్భాల్లో కంఠస్థం చేయాల్సిన అనేక శ్లోకాలు ఇందులో కనిపిస్తాయి. మహాభారతంలోని సంపూర్ణవస్తుతత్త్వాన్ని మనకు అందించే గ్రంథం ఇది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good