గురజాడ అప్పారావు (1861 - 1915)

    ఆధునిక సాహిత్య వైతాళికుడు. సాహిత్య లక్ష్యలక్షణాలలో విప్లవాన్ని సాధించిన మహాకవి. నాటకం, కథ, వ్యాసం, విమర్శ ఇత్యాది సాహిత్య రూపాలన్నిటా సమర్ధుడు. జీవితానికీ, సాహిత్యానికీ సాన్నిహిత్యాన్ని సమకూర్చిన మహాపురుషుడు. అన్ని దేశాలకు జాతీయగేయంగా ఉండదగ్గ 'దేశభక్తి'నుండి మొత్తం ఆంధ్రజీవిత సర్వస్వమనదగ్గ 'కన్యాశుల్కం' నాటకం వరకూ అనేక ప్రయోగాలు సాధించిన మనీషి. కాల్పనికతకు దూరంగా ఉండే వాస్తవికతను ప్రదర్శించిన శిల్పి.జ 'నాది ప్రజల ఉద్యమం. ఎవరిని సంతోష పెట్టడానికీ దానిని వదులుకోను' అన్న స్రష్ట్ర.

శ్రీశ్రీ (1910 - 1983)

    అభ్యుదయ సాహిత్యానికి భగీరథుడు. గురజాడకు సర్వసమర్థుడైన వారసుడు.

    ఆధునిక యుగస్వభావాన్ని, సాహిత్య సిద్ధాంతాల్ని సమగ్రంగా ఆకళింపు చేసుకొని అనేక ప్రయోగాల్ని జయప్రదంగా నిర్వహించిన సాహసికుడు.

    మరోప్రపంచపు మహాప్రస్థానానికి నేతృత్వం వహిస్తున్న మహాకవి.

    'వీళ్ళే నా వాళ్లు, వీళ్లే నా కళ్లు' అని ప్రజల్ని చూపుతాడు.

    'నా ఉద్యమం జయిస్తుంది' అన్న ఆత్మ విశ్వాసంగల మహాపథికుడు శ్రీశ్రీ. 

                                - రహి (సూరపనేని హరిపురుషోత్తమరావు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good