Rs.20.00
Out Of Stock
-
+
నేను సైతం... శ్రీశ్రీకి
తెలుగుదేశంలో మార్క్సిస్టు భావ ప్రచారానికి ఉపకరించిన కావ్యాల్లో ''మహాప్రస్థానం''కు గల ప్రాధాన్యం మరి దేనికీ లేదు. కావ్యంతో పాటూ కవి కూడా (ఎప్పుడే గ్రూపుకి అనుకూలంగా ఉన్నాడన్నది వేరే రాజకీయం) తాను చేయగలిగినంత దోహదం చేశారు.
ఇక కావ్యాన్ని అంచనా వెయ్యడంలో రెండు పద్ధతులున్నై. కేవలం జనంలో ఉన్న ప్రభావాన్ని బట్టి ప్రశంసించడం మొదటిది. రెండవది, ఆ కావ్యం జన్మించిననాటి సమాజమూ, కవి దృక్పథమూ, కవితా సిద్ధాంతాలు బట్టి సాహిత్యపరంగా అంచనా వెయ్యడం. ఇందులో రెండోది నిజమైన సాహిత్య విమర్శ ఔతుంది. ఆ దృష్ట్యా 'మహాప్రస్థానం'ని మరొక్కసారి పరిశీలించడం ఈ వ్యాసంలో జరిగింది. - అద్దేపల్లి రామమోహనరావు
పేజీలు : 31