"పంచమవేదం"గా పిలువబడే భారతంలో ఎన్నో కథలు, నీతులు, ధర్మసూక్ష్మాలు,... ఎన్నో ఎన్నెన్నో కలిసి మెలిసి వున్నాయి.

కథ - కథలో దుర్మార్గం, ఆవేశకావేషాలు ఎన్నో చదువుతున్న కొద్ది దరిశనమిస్తాయి.

భీష్ముల వారు, విదురుడు - ధర్మస్వరూపాలుగా కనబడితే, "ధర్మం" మూర్తీభవించిన "ధర్మరాజు" కనుపిస్తాడు.

కృప, ద్రోణులు, అశ్వత్థామలు - పరిపూర్ణ బ్రాహ్మణులుగా, స్వామిభక్తి పరాయణులుగా దరిశనమిస్తారు.

అందుకే - అన్నీవున్న భారతం, నా అభిలాషకు "అభిలాష"గా, "భాష"కు భాషగా భావానికి "భావం"గా, అన్నీ కలిసి, పార్వతీదేవి - నలుగు పిండితో విఘ్నేశ్వరుని చేసినట్లు, ఎన్నో కలిసిన, ఈ భారతంలోని ముత్యాల కథలు పఠితులకానంద మొనర్చుతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good