ఎంతో అందంగా ఉండి, విద్యావంతురాలై ఎన్నో ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టి, ఏమాత్రం హానికరంకాని 'బొల్లి మచ్చల' వ్యాధి వచ్చి, ఆమె ఆశాసౌధాలన్నీ కూలిపోయిన ఒక యువతిగాధ 'మహాశ్వేత'. అవతలి వారి బాధలను చూసి ఆనందించే సమాజాన్ని ఎదుర్కొని తన కాళ్ళపై తాను నిలబడి, తాను అబలకాదు సబల అని నిరూపించిన ఒక యువతి గాధ ఇది.

ఒక నవల ఆరేడు భాషల్లోకి అనువాదమైందంటే కథకథనాల్లో వైవిద్యం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇనోఓ్ఫసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి రాసిన 'మహాశ్వేత', 'డాలర్‌ కోడలు' నవలలు అలాంటివే. - ఈనాడు

మనసును మార్చిన రచన. దగా పడినా దిగాలు పడని ఓ థీరజ జీవన పోరాటం. - ఇండియా టుడే

బొల్లి సోకిన ఒక అందమైన యువతి జీవితం ఎంతటి విషాదపు మలుపు తీసుకుందో చెబుతూనే దాని నుంచి ఆ యువతి ఆత్మస్థైర్యంతో బయటపడిన వైనాన్ని సుధామూర్తి మహాశ్వేత నవలలో చిత్రించారు. ఇది ఒక రకంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశం. దానిని సుధామూర్తి హృద్యంగా ఆవిష్కరించారు. - ఆంధ్రజ్యోతి

Write a review

Note: HTML is not translated!
Bad           Good