Rs.30.00
In Stock
-
+
మహాకవులంతా మహాస్వాప్నికులే. వాళ్ళు ఏమిచ్చినా ఏమియ్యకపోయినా తమ 'వారసత్వం'గా ఒక మహాస్వప్నాన్ని జాతికిచ్చి దాటిపోతారు. అట్లా శ్రీశ్రీ మనకి మరో ప్రపంచ స్వప్నాన్నిచ్చిపోయాడు. ఆకలి లేని, వేదన లేని, వికృతి లేని ఒక భావనా ప్రపంచాన్ని చూపించాడు. 'పదండి ముందుకు...' అంటూ అటువైపు నడిపించాడు. ఆ గమ్యం చేరుకోగలమా? ఆ స్వప్నం సాకారం అవుతుందా? అవి వేరే ప్రశ్నలు. దాన్ని సాకారం చేసుకోలేకపోతే అది మన జాతి అసమర్థత. కవి కలగంటూనే ఉంటాడు. 'నువ్వూ ఒక ప్రపంచకవివేనా' అనే స్వీయప్రశ్నకి 'కాదు, మరో ప్రపంచకవిని' అని చెప్పుకొన్నాడు శ్రీశ్రీ.
పేజీలు :31