'నవయుగం కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఛందోబందోబస్తుల్ని ఛేదించే ముందు వాటిపై, మాటపై తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ ఇదీ తెలుసు నాకు - ఇదే మంచి మీకు - అని సాధికారికంగా ప్రకటించి జెండా ఎగరేసిన విప్లవకవి శ్రీశ్రీ.
రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ.
ఈ తెలుగు వాడి జీవనాడిని, మాట వాడిని, కవిత వేడిని లోకమంతటా సహృదయాలలో పలికించే ఉద్యమపుమహాప్రస్థానం
విదేశాంధ్ర ప్రచురణల ఈ ప్రచురణ.
మన దేశంలో రెండు శతాబ్దాలు జెండా ఎగరేసి దించిన దేశంలో -
ఇండియన్‌ జెండా -
కాదు - తెలుగు జెండా ఎగరేసున్న గూటాల కృష్ణమూర్తి గారికీ - మహాకవి శ్రీశ్రీ గారికీ - నా జోహార్లు ... బాపు
అధునిక తెలుగు కవిత్వం - తలరాత మార్చిన చేతిరాత - దాన్ని ప్రజాస్వామ్యీకరించి, దారి మళ్ళించిన భగీరధుని జీవజలం రాత - అధోజగత్సహోదరుల గళ స్వరం సిరాగా రాసిన కలం రాత - సామాజిక రుగ్మతులపై సమర భేరి మ్రోగించండని - విప్లవీకరించిన అక్షర లక్షల రాత. సోషలిజం భావజాలం రూపుకట్టించిన సచిత్ర విన్యాసాల కలవరింతల దాత. దోపిడి రాపిడి శక్తుల మరణశాసనం రాసే కృద్ధ యువనేత చేతిరాత. నవలోకం సృజియించిన బ్రహ్మరాత. రాస్తున్న యుగం తనదని, రాబోవు జగం మీదని, పోరాటం మీ చిరునామా అని. శ్రమజీవన సౌందర్యాన్వేషణ దిశలో. సామ్యవాద భావ సుమాలరవిరిసిన చేతిరాత. శ్రీ అంటే విషం శ్రీ అంటే శుభం - పోరుబాట జనావళికి శుభం - సమాభావన, నవజీవన బృందావన ప్రజావళికి శుభం. ఓ యుగం కవిత రాత. ఓ జగం శాసించిన కవి చేతి రాత.
అలాంటి శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం కావ్యాన్ని, మళ్ళీ ప్రజలకందిస్తున్నారు విశాలాంధ్ర ప్రచురణాలయం వారు.
ఇంతవరకూ వెలువడిన ''శ్రీశ్రీ'' సాహిత్యంలో శ్రీశ్రీ గారి చేతి రాతతో వెలువడిన గ్రంధం ఇదొక్కటే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good