'పెళ్ళి కాని' యువతి, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన 'ఫలానా రకం' అని తెలిసినా, అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పట్టించు కోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా? ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? ''నేను నీ భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్యకూడదు'' అంది. మరి, తను అతనికి భార్యగా మారాలను కున్నప్పుడు, అతనికి అప్పటికే తాళి కట్టించుకున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడనీ ఆ మోసంలో తను కూడా భాగస్తురాలిని అవుతున్నాననీ అర్థమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?

పేజీలు : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good