భారత కూమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకులలో కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావు ప్రముఖులు. ఇది ఆయన శతజయంతి ఉత్సవ సందర్భం. విద్యార్ధి దశలోనే ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించారు. అంతేకాక కమ్యూనిస్టు పార్టీలో అనేక బాద్యతలు నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 25 సంవత్సరాలు పనిచేశారు.

ఆరడుగుల ఆజానుబాహుడు ఆయన. నిత్యమూ వ్యాయామం చేసేవారు. తెలంగాణా సాయుధ పోరాటంలో వందలాది కార్యకర్తలకు, గెరిల్లాలకు శిక్షణ ఇచ్చారు. జనసేవాదళ నిర్మాణం, పార్టీలో ఆయనకు ఇష్టమైన విభాగం. నిజాం నిరంకుశ పాలనలో, భూస్వామ్య వ్యవస్థ క్రూరమైన రాజ్యంలో, తెలంగాణ సాయుధ పోరాటం మహత్తరమైన చార&ఇరతక ఘట్టం. తెలంగాణలో చైతన్యాన్ని పెంచడంలో, సాయుధ పోరాటానికి అవసరమైన భూమిక ఏర్పాటు చేయటంలో, మెరికల్లాంటి నాయకులను తయారు చేయడంలో ప్రధానపాత్ర వహించిన ముఖ్య నాయకులలో ఆయన ఒకరు. పోరాట ప్రారంభంలో - అత్యంత క్లిష్టమైన దాని విరమణలో - ఆయన అద్వితీయమైన పాత్ర నిర్వహించారు. శ్రీ చండ్ర రాజేశ్వరరావు (సి.ఆర్‌.) తమ స్వగ్రామం మంగళాపురం నుండి ప్రారంభించి, దేశ వ్యాపిత భూపోరాటాలకు నాయకత్వం వహించారు. కమ్యూనిస్టు ఉద్యమ విస్తృతికి ఎనలేని కృషి చేశారు. ఆయన శతజయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను, ఆయనపై పత్రికల వ్యాఖ్యలను, తదితర అంశాలను పునుర్ముద్రిస్తున్న ప్రచురణకర్తలు అభినందనీయులు. సంపాదకులు శ్రీ వై.వి.కృష్ణారావు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good