ఈ కథంతా మనోహరమైన శైలిలో వ్రాయబడింది. ఇదొక వచో గీతం : ఎన్నో ప్రాచీన గాథలు చమత్కారంగా, సజీవంగా చెప్పబడినాయి ఇందులో, శరత్కాలపు వెన్నెలలా హాయిగా, చల్లగా, మనోరంజకంగా వుంటుందీ గ్రంథం. ఆహ్లాదకరమైన విజ్ఞానోద్యానవనంలో విహరిస్తున్నట్లుంటుంది. ఇది చదువుతూంటే : శతాబ్దాల క్రిందట జీవించిన స్త్రీ పురుషులు ఈ నాటి మన ఇరుగు పొరుగు మానవులుగా వారి కృషిని గూర్చి సజీవంగా తోచే కథలు, గాథలు చెప్పగల దిట్ట రచయిత ఇలిన్. రుచీపచీ లేని చప్పని చరిత్ర గ్రంథాల్లా గాక దీన్ని ప్రారంభిస్తే కొసకంటా క్రింద బెట్టనీయదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good