ఎన్.బి.ఎస్. (రైటర్స్ కోఆపరేటివ్ సొసైటీ) అనే ప్రసిద్ధ మలయాళ ప్రచురణ సంస్థ ప్రచురించిన ''జారుకళ్'' అన మలయాళ దళిత కథా సంకలానికి అనువాదం ఈ పుస్తకం. ఈ సంకలనంలో 23 కథలున్నాయి. కథకులందరూ దళితులే. నేటి మలయాళ సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ముఖ్యధార.
మనిషికి ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడి జీవిత సమస్యలతోపాటు ప్రాంతాలకు మాత్రం పరిమితమైన కొన్ని సమస్యలు కూడా వుంటాయి. ఒక ప్రాంపతం తాలూకు అంటే ఒక ప్రాంతీయ భాషలో వెలువడిన సాహిత్యం చదివినప్పుడు అవి మనకు అవగతమవుతాయి. కేరళ రాష్ట్రానికి చెందిన దళితుల సమస్యలు తెలుసుకోవడానికే కాక తులనాత్మక అధ్యయనం కోసం కూడా పనికివస్తాయి ఈ కథలు. తొలి తరం దళిత రచయిత కథ మొదలుకొని నేటి దళిత రచయిత రాసిన కథ వరకు ఈ సంకలనంలో చోటుచేసుకుంది. మలయాళ దళిత కథల తొలి తెలుగు అనువాద సంకలనం ఇదేనని చెప్పవచ్చు. మలయాళం నుంచి నేరుగా తెలుగులోకి అనువాదం చేయబడిన సంపుటి ఇది.
పేజీలు : 140