మల్లాది రామకృష్ణశాస్త్రి గారు పుంభావసరస్వతి. మూర్తీభవించిన తెలుగు సంస్కృతికి ప్రతిరూపం. ఆరుద్ర గారి మాటల్లో చెప్పాలంటే ''ఆయన మనస్సన్యాసి, వసుదైక కుటుంబి, వేదాంతి, వినోది; వివిధ సాహిత్య సముద్రాలను తనలోనే యిముడ్చుకున్న అగస్త్యుడు బహుభాషాకోవిధుడు. ఎన్ని భాషలు నేర్చినా, ఎన్ని మతాలు వెతికినా వారు అన్వేషించేది విజ్ఞానంలోని వెచ్చదనం. అభిలషించేది కళలోని కమ్మతనం''.

మల్లాది ప్రాచీన, ఆధునిక సాహితీమార్గాల సమన్వయశీలే కాదు, హృదయవాది. అందుకే తన కథా రచనల ప్రయోజనం ''నీతి కాదని, జాతి అని'' చెప్పుకున్నారు. తన అవసరం కోసం కాకుండా నిర్మాత, దర్శకుల కోరిక మేరకే సినిమా పాటలు రాశారు. సినిమా రచనకు కావ్యగౌరవం కలిగించారు. 'చినికిన చినుకెల్ల మంచిముత్యం కాదని' మల్లాదివారే ఓ పాటలో పేర్కొన్నారు. ఆయన మొత్తంగా 40 చిత్రాలకు దాదాపు 185 పాటలు మాత్రమే రాశారు. ప్రతి పాట, ఆణిముత్యమేమీ కాదు. కానీ నూటికి డెబ్బయైదు శాతం మేలుబంతులే! వాటిలో 'గిరిజాకల్యాణం' శిఖరాయమానమైనది.

-  వి.వి.రామారావు

రచయిత

చిరంజీవులు, జయభేరి, రహస్యం, కలిమిలేములు చిత్రాల్లోని పాటలు శాస్త్రిగారి భాషలో చెప్పాలంటే 'సన్నజాజి పూవులు, సంపంగి పూవులే'.

రాగమయీ రావే, కనుపాప కరువైన కనులెందుకు, చికిలింత చిగురు సంపంగి గుబురు, ఏవో కనులు కరుణించినవి యీ మేను పులకించినది, తెల్లవారగవచ్చె తెలియక నా సామి మళ్లీ పరుండేవు లేరా, నీవెంత నెరజాణ మొదలైన పాటలు ఎవరూ మరచిపోలేనివి... వారి 'గిరిజా కళ్యాణం' యక్షగానం ఈనాటికీ గుర్తుపెట్టుకున్నామంటే అది వారి రచన గొప్పతనమే... అలాంటి మహాకవి సినీగీతాల గొప్పతనాన్ని నవలలు, కథలు మొదలైన యితర రచనల గురించి పరిశోధించి మధురమైన వ్యాఖ్యానంతో విశ్లేషణ చేసిన స్వరమిత్రులు డా|| వి.వి.రామారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

- ఆకునూరి శారద

ప్రముఖ గాయని, అమెరికా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good