మహేంద్ర ఒక నిత్యాగ్నిగుండం. నిరంతర జ్వాల. శరీరం భరించలేనంత తపన, మనస్సు బద్దలయ్యేంత బాధ అతడిలో కనిపిస్తుంది.

'నా హృదయపు గదిలో ఒక భావచిత్ర ప్రదర్శనశాల వుంది

నా మేధో మందిరంలో ఒక విజ్ఞాన వస్తు సంచయాగారముంది'

అంటూ పొరలు పొరలుగా తెరలు తెరలుగా తన ఆంతర్యాన్ని విప్పుతాడు.


ఒక మెరుపు. ఒక ప్రవాహం. సుడిగాలి మనల్ని చుట్టిముట్టినట్లు ఆయన కవిత్వం చదివితే ఫీలవుతాం.

మహేంద్ర స్వాప్నికుడు.

'జీవితంలో సరిపుచ్చుకోలేని

నా ఆత్మ చేస్తున్న నిరంతర పోరాటమే

సాగిస్తున్న ఎడతెగని విప్లవమే నా కవిత్వం

నాపై నా తిరుగుబాటే నా కవిత్వం

అందరినీ నిరసిస్తాను, చివరకు నా కవితనైనా సరే..' అనగలిగే సాహసికుడు.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good