కల్పన స్వల్పం-వాస్తవం అనల్పం

       సున్నితమైన విషయాలను అంతే సున్నితంగా చెప్పే పాతతరం పెద్దమనుషుల పంథా    కనిపిస్తుంది మధురాంతకం రాజారాం కథల్లో. 'విశ్వవిద్యాలయాల్లో ఏముంది? తనను నమ్ముకున్న యువకుణ్ని, భావిపౌరుణ్ని ఒక ఉద్యోగిగా, ఆ ఉద్యోగం దొరకడం గగనకుసుమమే గనుక ఆఖరుకొక అప్రయోజకుణ్నిగా, నిస్సహాయుణ్నిగా తీర్చిదిద్దే 'చదువు' మాత్రమే ఉంది. ఆ చదువే నాక బ్బింది!' అని వాపోయే చింతామణి కనిపించిన కథలోనే అక్షరజ్ఞానం లేకపోయినా, లోకజ్ఞానంతో తాను సుఖంగా ఉంటూ చుట్టూ ఉన్నవారిని సుఖంగా ఉంచే    ఖాదర్బాషా కనిపిస్తాడు. అటువంటి కథకు 'వరమివ్వని వేలుపు' అని పేరు పెట్టడంలోనే    కథకుడిలోని నేర్పు కనిపిస్తుంది.

       'బంగారం పండే పొలంలాంటి సంసారా'న్ని సిద్ధాంతి చలవతో చక్కదిద్దుకున్న సుమిత్ర 'కాటుక కంటి నీరు', మన సు ముక్కలైపోయిన శేషగిరి జీవితం ఏ మలుపు తిరిగిందో చెప్పే 'విధివిధానం' లాంటి కథలు రాజారాం సిగ్నేచర్ కథలు. ఆ వరసలో సునిశితమైన హాస్యం పాలు ఎక్కువ ఉన్న 'కథ అడ్డం తిరిగింది' వంటివీ ఉన్నాయి. అలాగని వాటిలో కూడా ఎక్కణ్నుంచో ఎత్తుకొచ్చిన వాతావరణమేదీ ఉండదు. 'వాస్తవం ఎక్కువగా, కల్పన తక్కువగా ఉండే కథలంటేనే తనకిష్టమని మా నాన్న చెప్పేవారు' అంటూ మధురాంతకం నరేంద్ర రాసిన ముందుమాట అక్షర సత్యమని ఈ సంకలనంలోని 39 కథలనూ చదివితే అర్థమవుతుంది.  

- అరుణ పప్పు

 

Write a review

Note: HTML is not translated!
Bad           Good