ఆరోజుల్లో రచయిత్రులు కథలు తక్కువగానూ, నవలలు ఎక్కువగానూ రాసేవారు. శ్రీమతి డి. కామేశ్వరి కథలే ఎక్కువ రాసారు. కామేశ్వరి కథకి షష్ట్యబ్ది పూర్తి అయిపోయింది. మూడుతరాల పాఠకులను తమ కథాకళితో అలంకరించారు. ఇంకా అలరిస్తునే ఉన్నారు.
ఇప్పటికే యీమె పేరు మీద పది కథాసంపుటాలు వెలువడ్డాయి. ఇది పదకొండో కథా సంపుటం.
శ్రీమతి కామేశ్వరి నిత్యోత్సాహి. కలం పట్టినవారికి వుండాల్సిన మొట్టమొదటి లక్షణం యిదే. తాము జీవిస్తున్న పరిసరాలను, తమ చుట్టూ వున్న సమాజాన్ని నిశితంగా చూడగలగాలి. ఫోటో తీసినపుడు మొదట నెగటివ్ వస్తుంది. తర్వాత దానిని పెద్దదిగా కావల్సిన ప్రింట్లు తీసి, ఫోటోని సమగ్రంగా అర్థం చేసుకుని ఆస్వాదించి ఆనందిస్తాం. డి. కామేశ్వరి లాంటి రచయిత్రులు పరిసరాలను నెగటివ్‍లో బంధించుకుని, వాటికి రంగులద్ది పాఠకులకు ప్రదర్శిస్తారు.
కొన్నింటికి విరమణలు వుండవు. జిగిలి వున్నన్నాళ్లు సాగించడమే. అందుకు కథారచనలాంటి సృజనాత్మకత వ్యాపకాలు అందరికీ అబ్బవు. ఇప్పటికే యీ రంగంలో లబ్దప్రతిష్టులైన శ్రీమతి డి. కామేశ్వరి మరో తరానికి కావల్సిన మరిన్ని కొత్త కథలు రాయాలని వారిని మనసా కోరుతున్నాను.
- శ్రీ రమణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good