టినేజ్ లో యువతీయువకుల మధ్య ఏర్పడే ఆకర్షణ. ప్రేమభావాలు చక్కగా వర్ణితమైన నవల ఇది. రచయిత్రి తంబళ్ళపల్లి రమాదేవి గారు తోలి ప్రయత్నంగా తెచ్చిన 'మధులిక' అనే ఈ నవల పాఠకులను ఆకర్షించగలదు. సున్నిత మనస్కుడైన విజయ్ ఆత్మాభిమానంగల మధులికను ప్రేమించడంలో పడిన తపన. ఆత్మసంఘర్షణకు ఈ నవల ప్రతిబింబంగా నిలుస్తుంది.
ఎన్నో మలుపులతో సాగిన 'మధులిక' నవల పాఠకులను ఆలోచింప చేయడమే కాకుండా గిలిగింతలు పెడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వస్తు వైవిద్యంతో పాటు. శిల్ప విన్యాసాన్ని చాలా సమర్దవంతంగా పోషించిన రచయిత్రి తంబళ్ళపల్లి రమాదేవి గారు 21వ శతాబ్దిలో నవలా ప్రపంచంలోకి దూసుకొచ్చిన నూతన శరం. చిన్నప్పటి నుండి కవితా వ్యాసంగంపై మక్కువతో రచనలు చేపట్టిన రమాదేవి గారు నేటి తరం రచయిత్రులకు ఆదర్శప్రాయులు. తొలిప్రయత్నంలోనే నవలను రాసిన రచయిత్రి.
హిందూ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను జీవన శైలిని మన జీవితంతో పాటు కాలంతో ముందుకు నడిపించాలన్నది రచయిత్రి ఆకాంక్ష.

Write a review

Note: HTML is not translated!
Bad           Good