''బృందావనము'' అన్న పేరును ఈ కవితా సంపుటిలో 'ప్రార్థనమ'న్న ఖండికలోని ''వచ్చియొకసారి నా ప్రాణవాయువునకు| కెదురెదురు చూచుచున్నదోయీ! మహాత్మ! అన్న తేటగీతి పద్యంలో ఈ కవి సూచించారు. హృదయ వేణువు మోగితేనే కానీ రసవత్కవిత వెలువడదు. వేణువు మ్రోగాలంటే ఊపిరులూదాలి. ఊపిరే ప్రాణవాయువు. అది హృదయంలో వేణువై మ్రోగాలంటే, శ్రీకృష్ణుని కృప ఉండాలి. అట్టి ఆ కృష్ణుని రాక వల్లనే కవి ఆత్మ - 'బృందావన' మౌతుందట. అటువంటి కృష్ణుని రాకకు ఎదురుచూస్తూ ఉంటానంటున్నారీ కవి. ఇది అపూర్వ విశిష్టభావన. ఇందలి ప్రతి ఖండికా కవి ఆత్మనే కాదు - పాఠకుని ఆత్మను కూడా 'బృందావనం' గావించునట్టిదే. ఇలా ఈ నామధేయం సార్థకం.

పేజీలు : 352

Write a review

Note: HTML is not translated!
Bad           Good