విశాఖపట్నం...
సముద్రం...
ఆ సమయంలో నీలి నీలి పూల పరికిణీ వేసుకుని, లేతనీలిరంగు జాకెట్టు వేసుకుని, నీలిపూలను జడలో తురుముకుని, నీలికళ్ళతో చూస్తున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉంది.
ఆ అమ్మాయి ఎర్రటి ముఖమ్మీద పడుతున్న నల్లటి కురుల్లా మాసిపోతున్న పడమటి ఎండ మబ్బుల మీద సన్నని చీకట్లు ముసురుకుంటున్నాయి.
చల్లదనంతో తడిసిన రామకృష్ణా బీచ్ కి దూరంగా ఉన్న వైట్ హౌస్ పక్కనున్న ఎత్తైన ఇసుక దిబ్బలు బంగారు కుప్పల్లా కన్పిస్తున్నాయి. ఆ కుప్పలకు అటూ ఇటూ రెండు పొడవాటి తాటి చెట్లున్నాయి. అక్కడ, ఆ ప్రదేశం ఆ సమయంలో నిశ్శబ్దంగా, నిర్జనంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఆ సమయంలోనే ఒక గాలి తెర హాయిగా అక్కడ చెట్లను, ఇసక దిబ్బలను రాసుకుంటూ, వింత శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ గాలికి ఓ బూడిద రంగు ఆర్గండీ చీర రెపరెపలాడింది. ఆ వెనక చేతి గాజులు చేసిన చిరుసవ్వడి.
చిరుసవ్వడి చేసిన ఆ గాజులు వేసుకున్న ఆ అమ్మాయి గాజు బొమ్మలా ఉంది.
ఆ అమ్మాయి పేరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good