పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము నాలుగు సంపుటాలుగా ప్రచురించాము.

ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రెక్కల మనుషులు, మొసలి మనుషులు, మరుగుజ్జు దేశస్థులు, వృశ్చిక జాతివాళ్ళు, ఉష్ట్రయోధులు, నరభక్షకులు, మాంత్రికులు`తాంత్రికులు, అఘోరాలే కాకుండా గండభేరుండాలు, పొలాల్ని దున్నే సింహాలు, రథం నడిపే ఏనుగులు మనకు దర్శనమిస్తాయి.

వైవిధ్యభరితమైన పాత్రలతో అడుగడుగునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో అనూహ్యమైన మలుపుతో చదివేవారిని ఉత్తేజ పరుస్తాయి.

ఈ సంపుటిలో మాయా సరోవరం, భల్లూక మాంత్రికుడు, ముగ్గురు మాంత్రికులు అనే మూడు నవలలు కలవు.

పేజీు : 352

Write a review

Note: HTML is not translated!
Bad           Good