'ప్రభవ' (1928) తర్వాతి కొద్ది సంవత్సరాలలో శ్రీనివాసరావు చాలా మంచి పద్యాలు రచించాడు. 'భారతి' మొదలు అనేక ఇతర పత్రికలవరకూ చెల్లాచెదురుగా పడివున్న ఆ పద్యాలను సమకూర్చువలసిన అగత్యం కూడా లేకపోవడానికి కారణం, కవి పోగొట్టుకున్న లిఖిత ప్రతిని పురిపండా అప్పలస్వామి పదిలంచేసి పెట్టారు. అందులో ఒక విశేషం వుంది. ప్రతి కండిక చివర, ఎదుటి పుటలో, తన రచనగురించి, తానై కవి ఇంగ్లీషు విమర్శ చేసుకొని వున్నాడు. ఇంగ్లీషులో వున్న ఆ లఘువ్యాఖ్యను కూడా ఇందులో పొందుపరుస్తున్నాను.

అటు 'ప్రభవ'కీ, ఇటు 'మహాప్రస్థానం' గీతాలకీ మధ్యలో ఇంచుమించు అయిదేళ్ళ ఎడం వుంది. ఈ 'పంచాబ్దంబులు' శ్రీఎ కవితా జీవితంలో అతికీలకమయినవి. 'ప్రభవ'లో ప్రతిధ్వనులుంటే 'మహాప్రస్థానం'లో ధ్వనులున్నాయి. వీటి నడుమ తమ కవితాకంఠాలని వినిపించినవే 'స్వర్గదేవతలు'. వీటికి చెవి ఒగ్గితేనే శ్రీశ్రీలో రాబోతున్న పెనుమార్పుని మనం ఆకళించుకోగలం. వీటిలో మనకి గొప్ప పెనుగులాట కనిపిస్తుంది. ఈ తపన మనని ఆకట్టుకుంటుంది. ఈ అయిదేళ్లలో తను రాసిన ప్రతి కవిత గురించి విశ్లేషణ తానే చేసుకున్నాడు శ్రీశ్రీ.

ఇది శ్రీశ్రీ రాసిన పద్యాలు. శ్రీఎ 'ప్రభవ' 'మహాప్రస్థానం' మధ్యలో పద్యాలు.

శ్రీశ్రీ స్వయంగా నోట్స్‌ రాసుకున్న పద్యాలు.

1970లో ''శ్రీశ్రీ సాహిత్యం-ఒకటి' లోనూ...1999లో శ్రీశ్రీ సాహిత్యసర్వస్వం-1లోనూ

'స్వర్గదేవతలు' పేరుతో అచ్చయ్యాయి.

కానీ వీటికి 'మారుమ్రోతలు' అని పేరు పెట్టాలని శ్రీఎ కోరిక.

శ్రీశ్రీ కోరిక మేరకు ఈ పుస్తకాన్ని ''మారుమ్రోతలు'' పేరుతో వెలువరిస్తున్నాం.

పేజీలు : 71

Write a review

Note: HTML is not translated!
Bad           Good