జూదా యదార్లలో జకరియాస్‌ కొడుకు బాప్టిస్టు జాన్‌ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. ‘‘పశ్చాత్తప పడండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతోంది’’ అని ‘‘ప్రభువు వొస్తున్నాడు. ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి’’ అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమీడతలూ, అడివి తేనే.

జెరూసలేం, జూదా జోర్దన్‌ నదీ ర్పఆంతాలనించి ఎంతోమంది వెళ్ళి తమ తమ పాపాల్ని చెప్పుకుని, జోర్దాన్‌ నీటితో, జాన్‌వల్ల పరిశుద్ధులయినారు. ఆ వొచ్చినవారిలో చాలామంది ఫారిసీలూ, సడ్యూసీలూ వుండడం చూసి వారితో జూన్‌ అన్నాడు. ‘‘ఓ విషసర్పాలారా, వొచ్చి మీద పడపోయే భీకరాగ్రహంనించి పరిగెత్తి, రక్షణపొందమని ముందే మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? సరే, ఐతే పశ్చాత్తాపానికి తగిన ఫలితాన్ని చూపండి. మాతండ్రి అబ్రహాంకదా, మాకేమని విర్రవేగకండి. నేను మీకు చెపుతున్నాను వినండి. ఈ రాళ్ళలోంచి అబ్రహాంకి సంతతిని పుట్టించగలరు ఈశ్వరుడు. గొడ్డలిని ఇప్పుడు చెట్ల మొదళ్ళకే పెట్టారు. మంచి పళ్ళని పండని ప్రతిచెట్టునీ కట్టెలకింద కొట్టి పొయ్యిలో పెట్టపోతున్నారు.’’

‘‘అయితే మమ్మన్నేం చెయ్యమంటావు?’’ అని అడిగారు జనం. ‘‘రెండు అంగీలున్నవాణ్ణి లేనివాడితో పంచుకోమను. తిండివున్నవాణ్ణి లేనివాడికి పెట్టమను’’ అన్నాడు...

పేజీలు: 284

Write a review

Note: HTML is not translated!
Bad           Good