'సారాంశంలో ఫెమినిజం ఒక విశ్లేషణా పద్థతి, జీవితాన్నీ రాజకీయాలనూ అర్థం చేసుకునే ఒక పద్ధతి. స్త్రీల గురించి సిద్ధంగా ఉన్న రాజకీయ పరిష్కారాలు ఇవ్వడం కాక ప్రశ్నలు అడగటానికీ సమాధానాలు వెతకటానికీ ఉన్న ఒక మార్గం. స్త్రీలు ఈ పద్ధతిని స్త్రీలుగా తాము పొందిన అనుభవాలను అన్వయిస్తారు. దానిలో వాళ్ళ ఉనికిని నిర్వహించే సాంఘిక అనుభవాన్ని మార్చటానికి ప్రయత్నిస్తారు. అనుభవాన్ని పరిక్షించి అర్థం చేసుకోవటానికి ప్రాధాన్యతనిస్తూ చైతన్యాన్ని పెంచటమూ, స్త్రీల జీవితాలను నిర్వహించే నిర్మాణానికి వ్యక్తిగత అనుభవాన్ని జోడించటమూ అనేది ఫెమినిజంలో ప్రాధమికమైన పద్థతి. ఈ విశ్లేషణ నేలమీదనుంచి మొదలవుతుంది.'' - వసంత కన్నబిరాన్‌
''సమాజంలో ఉత్పత్తి వనరుల్లో రకరకాల రూపాల్లో ఉండే మానవ శ్రమ కూడా ఒకటి. వీటిలో ప్రధానమైన ఉత్పత్తి వనరుగా స్త్రీల సంతానోత్పత్తి శక్తిని సోషలిస్టులు గుర్తిస్తారు. కాబట్టి సమాజంలో ఉత్పత్తి వనరుల మీద ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో స్త్రీల సపంతానోత్పత్తి శక్తి మీద కూడా ఆధిపత్యం కొరకు పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని గుర్తించకుండా సాంఘిక పరిణామాన్నిగానీ పరిణామ దిశనుగానీ మనం పూర్తిగా అర్థం చేసుకోలేమని సోషలిస్టు ఫెమినిస్టులు చెబుతున్నారు.'' - ఓల్గా

Write a review

Note: HTML is not translated!
Bad           Good