బాబాసాహెబ్ అంబేడ్కర్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి భారతదేశ చరిత్ర - కులవ్యవస్థ పై పరిశోధన చేశారు. చరిత్రలో 'మరుగున పడిన' విషయాలను బహిర్గతం చేశారు. చరిత్రను కొత్తగా విశ్లేషించారు. మాదిగవారు అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి చేసే పోరాటాన్ని చిత్రించారు.

'మాదిగవారి చరిత్ర' 2001లో ప్రచురితమై ఎనిమిది ముద్రణలు పొందింది. పేదరికం, వర్ణ వివక్ష, అవిద్య పై నిన్న వదిలిన పోరాటాన్ని తిరిగి నేటికి అందుకోక తప్పదని మాదిగవారిని జాగృతం చేసే రచన 'మాదిగవారి చరిత్ర - రెండవ భాగం'. కేవలం సమస్యలు ప్రస్తావించి వదిలి వేయక పరిష్కార మార్గాలు సూచించారు. భూమి, విద్య, స్వయంసహాయక సంఘాలతోనే మాదిగలలో ఆర్థికసాధికారత సాధ్యపడుతుంది. సమాజానికి అవసరపడే సాహిత్యాన్ని సృష్టించడమే ప్రగతిశీల రచయితగా శ్రీ లాబన్‌బాబు ధ్యేయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good