మా యాత్రలో మహంకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, విశ్వనాథ, వైద్యనాథ జ్యోతిర్లింగములు దర్శించాము. అన్నపూర్ణ, మంగళగౌరి మొదలైన శక్తిపీఠాలను చూశాము. గంగ, యమున, సరస్వతి, కావేరీ, నర్మద పవిత్ర నదులలో స్నానాలాచరించాము. పూరీ జగన్నాథుడికి ప్రణతులర్పించాము. లింగరాజుని అభిషేకించాము. చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న ఝాన్సీ కోటలో తిరుగాడాము. కళింగ యుద్ధము జరిగిన దయానది ప్రాంతాన్ని దర్శించాము. బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, జైన గుహలను ఉత్సుకతతో తిలకించాము. శిల్పకళా ప్రపంచంగా భాసిల్లే కోణార్క సూర్యునికి అంజలి ఘటించాము.

స్థూలంగా చెప్పాలంటే మా యాత్రలో ఆలయాలను, చారిత్రక ప్రదేశాలను, బౌద్ధ క్షేత్రాలను దర్శించాము.

మా యాత్రలో మేము చూచిన ప్రదేశాలకు సంబంధించిన వివరణాత్మక, విశ్లేషణాత్మక సమాచార సమాహారమే 'మా యాత్ర'. - డా. టి.అనంతాచార్యులు

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good