మొత్తంగా ఈ నాటి సమాజానికి ఇవి అవసరమైన కథలు. సమాజం ఎంత అమానవీయంగా ఉందో చూపించే కథలు. మానవీయ కోణాన్ని తట్టిలేపే కథలు. ముఖ్యంగా విద్యార్థులకోసం ఉపాధ్యాయులు తప్పక చదవాలి. తమ నిజ జీవితంలో విద్యార్థుల పట్ల తాము ఎంత మేరకు ఈ కథల్లోని టీచర్లుగా ఉండగలుగుతున్నామనే ఆత్మావలోకనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల కోసం తల్లిదండ్రులు చదవాల్సిన పుస్తకం. తమ పిల్లల్ని తాము ఎంతవరకూ అర్థం చేసుకోగలుగుతున్నారో పరిశృలించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సాటి మనిషి పట్ల బాధ్యతాయుతంగా ఉండమని, కనీసం ఒక్క క్షణం నిలబడి ఆలోచించమని ఈ కథలు పాఠకులను ప్రేరేపిస్తాయి. - బి.అనూరాధ

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good