''నా మీద తన ద్వేషమంతా కక్కడం ద్వారా (ట్రాట్స్కీయిష్టు) ప్రతిపక్షం నన్ను సన్మానిస్తోందని అనుకుంటున్నాను. ఇది ఇలాగే జరగాలి. పార్టీని ముక్కచెక్కలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం, లెనినిష్టు పార్టీ సూత్రాల మౌలిక విధానాలకు కట్టుబడి ఉన్న స్టాలిన్‌ను పొగడడం వింతగానూ, అవమానకరంగానూ ఉంటుందని నేను అనుకుంటున్నాను...- స్టాలిన్‌.

మోషే లెనిన్‌ పుస్తకం 'లెనిన్స్‌ లాస్ట్‌ స్ట్రగుల్‌' ఇంగ్లీషు ప్రచురణ 1968లో వెలువడింది. స్టాలిన్‌ గురించి కట్టుకథలతోనూ, అసత్యాలతోనూ, నిందారోపణలతోనూ, వక్రీకరణలతోనూ నిండిన ఈ పుస్తకం దుమ్ముదులిపి, అనువదించి, నాలుగున్నర దశాబ్దాల తర్వాత ''లెనిన్‌ అంతిమ పోరాటం'' అన్న పేరుతో 2014లో తెలుగు పాఠకులకు సమర్పించింది ''సమీక్ష ప్రచురణలు''. ఈ ట్రాట్స్కీయిష్టు ''సన్మాన పత్రానికి'' స్టాలిన్‌ సొసైటీ, ఇండియా, సమాధానమే 'మా సమాధానం'.

''లెనిన్‌ అంతిమ పోరాటం'' లాంటి వేల పుస్తకాల్లో, చలన చిత్రాల్లో, డాక్యుమెంటరీలలో, ''మేధావుల'' పరిశోధనల్లో మన ముందు ప్రతీ క్షణం నిలబెట్టబడుతున్న స్టాలిన్‌ రక్తసిక్తం చిత్రం పెట్టుబడిదారీ ప్రపంచం తన వర్గ ప్రయోజనాల దృష్ట్యా మన ముందుంచుతున్న ఒక అవాస్తవిక చిత్రం. ఈ అవాస్తవిక చిత్రాన్ని తొలగించి వాస్తవ చిత్రం కార్మిక వర్గం ముందు ఉంచడం తన కర్తవ్యంగా స్టాలిన్‌ సొసైటీ భావిస్తున్నది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good