‘కథల కన్నా జీవితాలు అద్బుతంగా ఉంటాయా?’ అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే.. ‘మా నాయన బాలయ్య’ పుస్తకాన్ని చదివిన వారెవరయినా ‘ఔను’ అనే సమాధానం చెప్పవచ్చు. దళితుల జీవితాల్లోని వైవిధ్యాలను వైరుధ్యాలను ఈ పుస్తక రచయిత డా॥ వై.బి సత్యనారాయణ నిశితంగా వివరిస్తాడు.
డా॥ వై.బి తన తండ్రి చరివూతను వివిధ కోణాల్లో వివరించిన రచననే ‘మా నాయన బాలయ్య’. ఇది సజీవ చరిత్ర కాబట్టే సుడిగుండాలను సుడి చుట్టి తన కడుపులో దాచుకున్న జీవనదిలా సజీవంగా సాగుతుందీ కథ. కనుకనే ఒకసారి ఎవరైన దీన్ని చదవడం మొదలు వెట్టింవూడంటే పూర్తిగా ఒడ్సెంత వరకు పుస్తకాన్ని కింద వెట్టరు .

తెలంగాణలోని వెలి వాడల్లోని దళితుల జీవితాల్లో తంతెలు, తంతెలుగా పేరుకుపోయిన అంటరానితనం, వెట్టి దోపిడి, ఈసడింపులు, చీత్కారాల నడుమ పెనుగులాడిన బత్కులు. కొన్నింటిలో ఓడిపోయినా.. తమ గమ్యం ‘ఎటువైపు?’ అనుకుంటూ భవిష్యత్తును నిర్మించుకుంటున్న చరిత్ర. దళితులు ఇటువంటి తరతరాల చరిత్ర నుండి వర్తమానంలోకి అడుగులేస్త్తున్న అరుదైన పుస్తకమిది.

విశాల దక్కన్ ప్రాంతాన్ని పాలించిన 5వ నిజాం, ‘మీర్ తహ్నియత్ ఆలీఖాన్ అఫ్జుల్ ఉద్‌దౌలా’ కాలంలోనే మాదిగ ఎలుకటి నర్సయ్య చెప్పులు కుట్టిస్తడు. ఈయన పనితనానికి ఎంతగానో మెచ్చిన ఆ రాజు 50 ఎకరాల భూమిని నర్సయ్యకు ఇనాం ఇస్తడు. దీంతో నర్సయ్య కుటుంబం దశ తిరగడం నుండి ‘మా నాయన బాలయ్య’ కథా రచన షురువైతది. ఇది నర్సయ్య జీవితంతో మొదలై రాజులకైనా సామాన్యులకైనా చెప్పులు కుట్ట్టే పనితనం నుండి ఎలుకటి వంశంలో మూడవ తరం నాటికి విశ్వవిద్యాలయంలో అన్ని కులాలకూ ఏ అడ్డూ లేకుండా విద్యను బోధించ గలిగే విధంగా, ప్రొఫెసర్లుగా ఎంతో కష్టపడి ఎదగడాన్ని కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఈ స్థాయిని అందుకొన్న తన కొడుకులను చూసి మురిసిండు నర్సయ్య కొడుకైన బాలయ్య. ఈ బాలయ్య కొడుకే మన రచయిత డా॥ వై.బి. సత్యనారాయణ. ఆయన తన తండ్రి కాలం చేయడం వరకు ఈ పుస్తకాన్ని రాసిండు.
ఈ పై మూడు తరాల కాలంలోని దళిత సమాజంలో, దళితేతర సమాజాలలో వచ్చిన మార్పులు, ఇప్పుడు ఇంకా రావాల్సిన మార్పులనూ, ఈ మార్పుకు అవసరమైన చైతన్యాన్ని అడ్డుకుంటున్న బ్రాహ్మణీయ భావజాలాన్నీ ఎంతో ఆసక్తికరంగా, జ్ఞానాత్మకంగా పొందుపరచడంలో రచయిత సఫలమయిండని చెప్పాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good