మీ చేతిలో ఒక మంచి పుస్తకం ఉన్నది. దానిని మీరు చదవబోతున్నారు. దీని పేరు ''మా మంచి నాన్న'' ఇదేంటి ఎన్నో మంచి పేర్లుండగా ''మా మంచి నాన్న'' అని పేరు పెట్టారు అని ఆశ్చర్యపోతున్నారు కదా!

        ఈ గేయాల సంకలనానికి ''మా మంచి నాన్న'' అనే పేరు పెట్టడం సముచితంగా ఉంది. పిల్లల్ని పెంచి పెద్దజేసి వారికి విద్యా బుద్ధులు నేర్పి, సరైన నడతలో నడిపి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది తల్లి తరువాత తండ్రే కదా! అందుకే ''మా మంచి నాన్న'' అని పేరు పెట్టారు కవిగారు.

ఈ సంకలనంలో వివిధ ఇతివృత్తాలకు చెందిన గేయాలు ఉన్నాయి. అవి అన్నీ పాడుకోడానికి అనువైనవే!

ఈ పుస్తకంలో మొదటి గేయం ''సిద్ధి గణపతి'' ఇందులో...

''ఎల్ల విద్యలకు

ఒజ్జవు నీవే

సిద్ధికి బుద్ధికి

నెలవవు నీవే''... అని స్తుతించి గేయం చివరిలో


''చల్లని చూపును

ప్రసరించుమయ్య

మంచి బుద్ధులను

ఒసంగుమయ్య'' అని అర్థింపు ఉంటుంది. - రెడ్డి రాఘవయ్య

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good