గోఖలే కథల్లో ఉక్కడా గోఖలే కనబడరు. రచయితతో ప్రమేయం లేకుండా కథ తనదారిన తాను పోతుంది. పాత్రలు రచయిత తమ చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టు కాకుండా తమంత తాముగా ప్రవర్తిస్తాయి. పాత్రలు స్వయం వ్యక్తాలు కావటం గోఖలే కథల్లోని గొప్ప రచనాశిల్పం. స్వభావ వాదంలోని ఆహ్లాదకర పార్శ్వానికి, వాస్తవికతా వాదంలోని అనుకూల పార్శ్వానికి గోఖలే కథలు ఉదాహరణలు.

ఈ కథా సంపుటిలో స్మరణ, మూగజీవాలు, పాలపిట్ట గూడు పెట్టింది, ఆరికేం మారాజులు, శివరేత్రి తిరణాళకు, పిప్పిందట్లు, మార్పు, పాలెంలో బొమ్మలాట, కిష్టయ్య పంతులు, బల్లకట్టు పాపయ్య, కిష్టమ్మగారి పెద్దజీతగాడు, బండిరాముడి పెళ్లాం, పంట సేలు, రాయి మడుసులు, కొండాయిపక్షి అనే 15 కథలు ఉన్నాయి.

పేజీలు : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good