వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన్నర శతాబ్ద కాలంలో సంభవించిన పరివర్తనను మనతో తిరిగి పంచుకోవడంలోచలచిత్రకారుడైన వంశీ సాహిత్యకారుడుగా రూపొందాడు.

       తనకి కనిపిస్తున్న దృశ్యాలని తను ఊహించుకున్న దృశ్యాలని కూడా నాలుగైదు వాక్యాలతో నీతిరంగుల చిత్రాలుగా మన ముందుంచాడు. కావడానికి ఈ కథలకి పసలపూడి కేంద్ర బిందువే అయినప్పటికీ కథా స్థలం అనేక వృత్తాలుగా విస్తరిస్తూ పోయింది. ఈ వృత్తాలన్ని ఒకదానికొకటి మానవ సంబంధాలతో సజీవ సంవేదనలతో అనుసంధానించి ఉన్నాయి. ఈ సంబంధాలలో ఎక్కడ ఏ ప్రకంపనం తలెత్తినా, దాని చప్పుళ్ళని పసలపుడిలో పసిగట్టాడు రచయిత. అలాగే పసలపుడిలో ఏ సంచలనం తలెత్తినా, ఆ ప్రకంపనాలు ఈ వ్రుత్తాలన్నింటి పొడుగునా సుదూరానికి ప్రవహించడం కూడా చూపించాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good