భారతదేశం విభిన్న మతాల, సంస్కృతుల సంగమం అని, ఒక రంగుల హరివిల్లన్న భావనను నేడు కొంత మంది పని గట్టుకుని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర తిరగరాస్తున్నారు. అభూత కల్పనలు చేస్తున్నారు. పుక్కిటి పురాణాలను చరిత్రగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందరో భారత చరిత్రకారులు, విదేశీ చరిత్రకారులు కూడా భారతదేశ చరిత్రను శాస్త్రీయంగా విశ్లేషించారు. వివరించారు. అందులో ప్రముఖులు రొమిల్లా థాపర్‌. చరిత్రను ఒక సామాజిక శాస్త్రంగానే గాదు, ఎప్పటికప్పుడు పెరుగుతున్న శాస్త్ర జ్ఞానంతో, రుజువుల సాక్షాఓ్యల ఆధారంతో జరిగిన ఘటనల సమాహారంగా ప్రజల ముందుంచేందుకు అహారహం తపించిన సృష్ట, నిరంతర సత్యాన్వేషిణి. నిత్య జ్ఞానాన్వేషిణి.

ఆమె భావాలను, అనేక రకాలుగా మనతో పంచుకున్నారు. మతం, జాతి, జాతీయత, చరిత్ర, చరిత్రలో స్త్రీలు, విద్య మొదలైన అంశాలపై ఈనాడు మనం ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకు సమాధానాలున్న కొన్ని వాస్యాల, ఇంటర్యూల కూర్పు ఈ పుస్తకం.

Pages : 151

Write a review

Note: HTML is not translated!
Bad           Good