భారతదేశంలో ఒక గ్రామం, వేలాదివేలవంటిది. ఒక అనామకబాలుడు, లక్షలాది ఇతరుల వంటివాడు. ఏమీ చెప్పుకోదగినదికానట్టి, మరెందరినో పోలిన బాల్యం, ఏఒక్కటీ అంత ముఖ్యం కాని - సంఘటన వెంట సంఘటన... తోసుకురాగా, తనకు తెలియకుండానే తిరుగుబాటు మనస్తత్వంలోకి తిరిగి, దాని ప్రభావంతోనే జీవితంలోకి దుమికాడు. పరుల స్థితిగతులు తనవని నిరంతరం అనుభూతి పొందే నైజం ఎందుకో అవడిందతనికి. అనూహ్యకారణాల ఫలితంగా, నిచ్చెనలందించినట్టు పైపైకి పోయాడు. సాధారణ గ్రామీణుడుగా ప్రారంభించి ప్రధానమంత్రిగా సాగిన దీర్ఘ ప్రయాణం - ఎక్కడా వేడుకంటూ లేని లక్ష్యోన్ముఖ ప్రయాణం - సాగించాడు. ఏ స్థాయికెదిగినా ఎప్పుడూ భూమ్మీదనే ఉన్నానన్న నమ్మకంతో, ఆ భూమిపైన విజృంభిస్తున్న భీకరవాస్తవాలపైనే దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చాడు. సంతత ఉడ్డయనానికి సంకల్పించిన విహంగము తాను. అగాధ కల్లోలిత సముద్రంలో ఎక్కడో పుట్టి, తీరమెంత దూరమో తెలియక, లక్ష్యపెట్టక, నిరంతరం దానివైపు ఎగుడుదిగుళ్ళతో కదులుతున్న చిన్ని కెరటం-

- ఇదంతా ప్రజాస్వామ్య మహామహిమకు పడుతున్న అద్దం...

ఇది సారాంశం - ఇంక తేదీలెందుకు?

Write a review

Note: HTML is not translated!
Bad           Good