ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడం

ఏ ప్రాంతానికైనా చరిత్ర, సంస్కృతులుంటాయి. అక్కడి శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, గుళ్లు, గోపురాలు, వేషభాషలు, ఆచార, వ్యవహారాలూ, ఆటలు, పాటలూ, ఆ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి అద్దంపడతాయి. విలక్షణ నైసర్గిక స్వరూపంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకొన్న రాయలసీమ రతనాలసీమగా వాసికెక్కింది. ఎక్కడ చూచినా విశాలమైన దేవాలయాలూ, శిల్పాలే. విజయనగరకాలంలో రాయలసీమనిండా ఎన్నో దేవాలయాలు, గోపురాలు, మండపాలూ నిర్మించబడి దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. తిరుపతి, తిరుమల, కాళహస్తి, ఉదయగిరి, పుష్పగిరి, వంటిమిట్ట, సిద్ధవటం, నెల్లూరు, తాడిపత్రి, లేపాక్షి దేవాలయాలు విజయనగర కాలపు ఆలయవాస్తు శిల్పానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

రాయలసీమలో అన్ని దేవాలయాలూ ఒక ఎత్తైతే, లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం ఒక ఎత్తు. విజయనగర ప్రభుత్వంలో అదనం మనం పెనుగొండలో కోశాధికారి పనిచేసిన విరుపణ్ణ, లేపాక్షి దేవాలయాన్ని విస్తృతపరచి, అద్బుత శిల్పకళతోనే కాక, అపురూప చిత్రకళతో కూడా అలంకరించాడు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారికి ఒక్కసారిగా విజయనగర కాలంలో కెళ్ళామన్న భ్రమ కలుగుతుంది. అసంపూర్తిగానున్న కళ్యాణ మండపం అలనాటి శిల్పుల హస్త కళాలాఘవానికి మచ్చుతునకలు. లేపాక్షిలో ఉన్న బసవణ్ణ విలక్షణ రూపలావణ్యంతో ఇలాంటి నంది, రాష్ట్రంలోనే కాక, దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేని ఖ్యాతి దక్కించుకొంది. ఇంతటి అపురూపమైన ఆలయం, బసవణ్ణ శిల్పాలను ప్రతిరోజూ, వందల వేలకొద్ది దేశీ, విదేశీ పర్యాటకులు, భక్తులు దర్శిస్తూనే ఉన్నారు.

Pages : 56

Write a review

Note: HTML is not translated!
Bad           Good