లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశీలించాడు. 1968లో మొదటి ఆంగ్ల ప్రచురణ వెలువడిన వెంటనే ఈ రచనను సప్రమాణ గ్రంధంగా పరిగణించారు. తన అంత్యదశలో లెనిన్ చేసిన అంతర్, బహిర్ యుద్ధారావాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విప్లవాన్ని, పార్టీని, సోవియట్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి లెనిన్ చేసిన పోరాటాన్ని ఈ రచన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చరిత్ర క్రమానుగతిని అర్థం చేసుకోవడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది.

సోషలిజం భవిష్యత్తు కోసం రష్యన్ విప్లవం తీరుతెన్నులను, దాని వైఫల్యానికి గల కారణాలను లోతుగా అర్ధం చేసుకోవడం అవసరం. అందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది. లెనిన్‌ని నూతన కోణంలో అధ్యయనం చేయడానికి ఈ ప్రచురణ ఒక సందర్భంగా ఉపయోగపడవచ్చు. ఈ అధ్యయనం లెనిన్ ఆలోచనలను, కృషిని, వారసత్వాన్ని పునః సమీక్ష చేసే దిశగా సాగాల్సిన అవసరం ఉంది. లెనిన్ భావాలు, కృషికి ఉన్న వర్తమాన అనుగుణ్యతను మదింపు వేయాలి. భవిష్యత్ సోషలిజానికి లెనిన్ ప్రసంగికత ఏ మేరకు అనే అంశంపై కూడా ఆలోచన సాగాలి. ఈ కృషికి తెలుగు సమాజంలో ఈ పుస్తకం ఒక సందర్భం కావచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good