సామెతల నుంచి వచ్చిన కథలతో పిల్లలు చదువు కోవడానికి అనువుగా ఈ కథలు రాశారు. దీనికి తోడు ప్రతి కథకి వేయించిన బొమ్మ, ముచ్చటైన ముద్రణ అదనపు ఆకర్షణలనే చెప్పాలి. జానపద గాధలతో ఉండే సార్వజనీనత, విశ్వజనీనత ఈ కథలలో కూడా కనిపిస్తాయి. అయితే చెప్పన తీరు వేరు. ఎత్తుగడ, ముగింపు నేపథ్యం వేర్వేరు.

ఒకింత కల్పన కాసింత వాస్తవికత, ఆసక్తికరప్రారంభం, ఆశ్చర్యకర కొసమెరుపు. ఈ లక్షలణాలతో సాగాయి యిందులో కథలు. మన చుట్టూ ఉండే వ్యక్తులు ప్రవర్తన ఆలోచనలకీ అద్దంపట్టిన ఈ కథల్లో హాస్యంసాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి బాగా నచ్చుతాయి.

ప్రతి ఒక్క కథా పిల్లలకు పరమాన్నం బాలలపై నైతిక విలువల ఆవశ్యకతను నూరిపోసి, సమయస్ఫూర్తి నేర్పించి, కుతూహలం రేకెత్తించి, పసందైన విందు నిచ్చే సమాహారం. ఇందులో మొత్తం 41 పిల్లల కథలున్నాయి. ఇవన్నీ కూడా పిల్లలంతా హాయిగా చదువుకుని మురిసిపోయే కథలే.

ఇంత చక్కగా రాసిన రచయిత్రి సుధామూర్తి పిల్లల లేత మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good