'ఈ చట్టం వలన న్యాయం దొరుకుతుందా?!- నిర్భయచట్టం ది క్రిమినల్‌ లా (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌, 2013 (నేర శిక్షాస్మృతి - సవరణ చట్టం - 2013) ప్రజాఉద్యమం ద్వారా, ముఖ్యంగా మహిళల తీవ్రమైన, ఆందోళనల కారణంగా అమలులోకి వచ్చింది. గ్రంథంలో చర్చించిన విధంగా ఇందులో చాలా ముఖ్యమైన నిబంధనలను సవరించటం - అంతకు ముందు ఉన్న చట్టాల స్ధానంలో కొత్తవి ప్రవేశపెట్టడం, నిందితులకు కఠినమైన శిక్షలు, బాధితులకు కొంత ఉపశమనం కలిగేలా విధానాలను రూపొందించారు.

అయితే చట్టాలు చేసినంత మాత్రాన 'మానభంగపర్వాలు' ఆగిపోవు. చిత్తశుద్ధి, వేగవంతమైన దర్యాప్తు, విచారణ ఉండి, కఠినమైన శిక్షలు అమలు చేసిననాడు, ఈ చట్టం కొంత భయం కలిగించకమానదు.

ఈవిధంగా నిర్భయ చట్టం అమలులోకి తెచ్చి నిందితులకు కఠిన శిక్ష పడితే, ఇటువంటి నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా భారతదేశంలో మహిళలు, బాలికలు తాము జీవించే హక్కును పొందాలనీ, సమాజంలో తిరిగే హక్కును కాలరాసే కామోన్మాదులబారి నుండి రక్షింపబడాలనీ, అంతేకాకుండా వారు చక్కటి ఆత్మవిశ్వాసంతో, సంతోషంతో జీవించగలుగుతారనీ ఆశించవచ్చు''. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good