ఈ కథ ఈరోజుది కాదు మన అమ్ములలను వారి అమ్మమ్మల, అమ్మమ్మలను తరతరాలుగా వేటాడుతున్న హింస, వెంటాడుతున్న వేదన ఇది. శతాబ్దాలుగా ప్రవహిస్తున్న కన్నీళ్ళ నదులివి. పదే పదే రగులుతున్న హింసను, దౌర్జన్యాన్ని దు:ఖాన్ని, సంతోషాన్ని మనిషి నుంచి మనిషికి మారుతున్న కాలంలోనూ మార్పులేని జీవితాన్ని జీవించడాన్ని, దైన్యాన్ని వేదనను దిగమింగిన కథలివి. అయినా ఇన్ని బాధల నడుమ ఒక పాటకు, ఆటకు, కళకు, కవితకు, రూపానికి, ప్రతిరూపానికి అందరితో ఆనందించే, అల్ప సంతోషాలు, ఆత్మానందాలు తళుకులీనుతూనే ఉన్నాయి. అవికూడా కథలే, కథలుగా మెదలుతున్న స్వప్నాలే.

న్యాయసూత్రాల్ని నూతనంగా నిర్వచించాల్సిన సమయం ఇక ఆసన్నమైంది. కోర్ట్స్‌ ఆఫ్‌ ఉమెన్‌ స్త్రీలపై హింసలను ఖండిస్తున్నాయి. మానవత లేని దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. విషయ పరిజ్ఞానంతో కొత్త ఆలోచనలను సూత్రీకరిస్తున్నాయి. స్త్రీల పట్ల ఆదరణ, సానుభూతి, అందరూ సమానమే అన్న విజ్ఞత, అందరికీ మంచి మార్పు తేగల సరికొత్త రాజకీయాలను నిర్వచిస్తున్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good