Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Veedani Needa

ఆమె నర్సు; పేరు క్రాంతి; మంచితనం, దయ, జాలి, ఔదార్యం, సేవానిరతి ఆమె సొత్తు; చల్లనిచేతి స్పర్శతో కరుణపూరిత నయనాలతో ఎందరో రోగుల్ని బాగుచేసింది. ''చల్లని తల్లి'' అని పదిమందిచేతా పిలిపించుకుంది.అతను అజ్ఞాత జీవితానికి అంకితమైన ఓ యువకుడు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన వేన్‌గార్..

Rs.80.00

Yakshaganam

'శ్రీకృష్ణకుంజ్‌' దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. 'కృష్ణం భజరాధా !' అని కొన్ని కంఠాలు రకరకాల రాగాలు కలిపి పాడుతున్నాయి. ఆవరణ అంతా అగరత్తుల సువాసన. పువ్వుల సువాసనతో ఏవో లోకాలకు తీసుకుపోతుంది. గేటు ముందునుండి వెడుతున్న జనం ఒక్క క్షణం ఆగి కృష్ణభజన విని వెళుతున్నారు. కొందరు లోపలికి వెళ్ళి ఏమిటని చూస్తున్న..

Rs.100.00

Rangularaatnam

గోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరింలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి. గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్త..

Rs.75.00

Modati Ettu

చదరంగం ఆడడం మీకు వచ్చా? రాకపోతే నేర్చుకోండి. చదరంగం ఆటలోని మొదటి ఎత్తులు యెలా వెయ్యాలో యీ ''మొదటి ఎత్తు'' పుస్తకం మీకు నేర్పుతుంది. ఇదివరకే మీకు ఆడడం వచ్చా? అయితే యింకా మెరుగు పరుచుకోవడానికి యిందులో వున్న అభ్యాసాలు సాయపడతాయి. చదరంగం ఆట అంటే అందరికీ ఆసక్తే. ఇది ఒక శాస్త్రం, ఒక క్రీడ, ఒక కళ - మనిషి ప..

Rs.230.00

Ajaramara Bharatades..

నాగరికత ఉదయించిననాడే జన్మించిన దేశం భారతం. ఇతర సంస్కృతుల ఆవిర్భావాన్ని, ధూళిలో కలిసిపోవడాన్ని కూడ  చూసిన దేశం భారతం. ఎంతో వైభవాన్ని చవిచూసింది; దాడులను ఎదుర్కొంది. ప్రశంసలు అందుకుంది; దూషణలు భరించింది. ఇన్ని వేల యేళ్ల తర్వాత కూడా, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడ, ఇంకా ఇక్కడ సజీవంగా ఉంది. కొన్ని శత..

Rs.299.00

Kakatiya Yugandhar

క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అ..

Rs.100.00

Toorupu Gaalulu

''గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు... అనేకానేక సూక్ష్మతలు, పొరలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నిటినీ ప్రస్తావించడం సాధ్యం కాదు, భావ్యం కూడా కాదు. ఎవరికివారు చదువుకోవాలిసిందే. కథలన్నిటినీ రచయిత ఎంత ఓర్పుగా తీర్చిద..

Rs.180.00

Aha Emi Ruchi...

వంట ఆడవారే చెయ్యాలనే నిబంధనలకు కాలం చెల్లింది. ముఖ్య కారణం. ఈ రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలలో పగలనక, రాత్రనక అహర్నిశలూ కష్టపడుతున్నారు. అందువలన స్త్రీలకు వంట చేయడానికి, పిల్లల ఆలనాపాలనా చూడటానికి తగిన సమయం ఉండట..

Rs.80.00

Edaari Poolu

ఆ అమ్మాయికి పధ్నాలుగేళ్ళు. ఇప్పటివరకూ తనను నిఖా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తను చూడలేదు. జిల్వా సమయంలో అద్దంలో మొహం చూపిస్తారు కదా చూద్దామనుకుంది. కానీ జిల్లా లేకుండానే పెళ్ళితంతు ముగించారు. నిఖా చేస్తున్నట్లు కాకుండా ఏదో నేరం చేస్తున్నట్టు... హడావుడిగా చేసేశారు. సుహాగ్‌ రాత్‌ రోజు కళ్ళెత్తి అతని ..

Rs.150.00

Sisiravela Katha Sam..

ఈ 'శిశిరవేళ కథా సంపుటం'లో ఆర్ముగం-అనంతలక్ష్మి, అనుకోని అతిధి,  మిగిలిందేమిటి?, మారిన ముఖచిత్రం, జబమాలై ఆత్మహత్య, నష్టజాతకుడు, మూగపిల్ల, తాతిగాడి చొక్కా, శిశిరవేళ, విద్య- వైద్యం, డబ్బు మొక్క, కరిగిన రంగుల కల, బంగారు కొండ, నిప్పు, చీకటి తెరలలో కరిగిన బొమ్మ, నీకు భార్యనవుతాను, విడిన మబ్బు, అర్జున..

Rs.120.00

Divyaanubhava Murthu..

ఈ సంపుటిలో 54 వ్యాసాలున్నాయి.  వ్యాసవస్తువేదైనా అందులో సామాజిక స్పర్శ, ఆధ్యాత్మిక చర్చ చేర్చడం లక్ష్మీప్రసాద్‌ రచనా విధాన వైశిష్ట్యం.  మహనీయులు, గురువు, ఆడంబరాలు, మనసు, సేవ, ఆధ్యాత్మికత - ఇలా వీటిలో ఎన్నో అంశాలపై ఆలోచనలు కలిగించే విషయాలను సుబోధం చేశారు.  ఎక్కడా కఠిన పారిభాషిక పదాలు లే..

Rs.50.00

Maruvaraani Purana M..

ఈ కథలన్నీ ఎన్నియుగాలైనా వసివాడనివి. స్ఫూర్తిమంతమైనవి. ఒక్కో పాత్రా వ్యక్తిత్వవికాస దర్పణమవుతుంది. భారత భాగవత రామాయణాది గ్రంథాలలో అలాంటి సమున్నత వనితా పాత్రలెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఎంతో శ్రమకోర్చి గుదిగుచ్చి కథనాత్మకశైలిలో వెంటాడే వాక్యాలతో తీర్చిదిద్దటమంటే మాటలు కాదు. ఈ పుస్తకంలో ఎంచుకున్న స్త్ర..

Rs.182.00

Sir Arthur Cotton

పలువురు ప్రముఖ ఇంజనీర్లు భారతీయులకు తెలుసు. వారందరిలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌కు ఒక ప్రత్యేక స్థానం వుంది. ప్రత్యేక తరహాకు చెందినవారు. ఆయన కేవలం ఇంజనీరు మాత్రమే కాదు. ఉత్సాహవంతుడు. గొప్ప భావుకుడు. మానవజాతి అభ్యున్నతికి కృషి చేయాలన్న దీక్ష, దక్షత కలవాడు.మన మాతృభూమి గురించి ''లేదురా ఇటువంటి భూమి ఇంకెందు''..

Rs.100.00

Kidnap

రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ఒక పెద్ద అవినీతి తిమింగలం. కానీ అతన్ని సిబిఐ కూడా పట్టుకోలేకపోయింది. ప్రకృతిపై అతనికున్న ఒకే ఒక బలహీనత వల్ల నక్సలైట్లు అతన్ని కిడ్నాప్‌ చేయగలిగారు. వారి వ్యూమం, ప్రభుత్వ ఆధీనంలో విచారణ లేకుండా మగ్గుతున్న తమ ముగ్గురు కామ్రేడ్లను విడిపించుకోవడం, అలాగే కొన్ని కోట్ల విలువైన అతని ..

Rs.150.00

Vennelamma Kathalu

వెన్నెల అంటేనే హాయి. వెన్నెలంటేనే ఉల్లాసం. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు వెన్నెలంటే అందరకూ ఉత్సాహమే! ఆ హాయి, ఆనందం, ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రచయిత తన రచనకు ''వెన్నెలమ్మ కథలు'' అని పేరు పెట్టి న్యాయం చేకూర్చాడనిపిస్తుంది. అన్ని కథలు అద్భుతమే! పంచభక్ష్యాలు వడ్డిస్తే, బేధాలెంచగలమా? దేని ర..

Rs.160.00

Rekkadinantha Kaalam..

'అన్నంగుడ్డ', 'సానరాయి' వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు.... ఈ నవల రాజకీయాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. -..

Rs.200.00

Connect To God

మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు. నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బ..

Rs.210.00

Nemaleeka Baruvu

''వడ్డీ వందకి నాలుగు రూపాయలా'' నాయన అర్థించేవాడు. ''నీకక్కరలేక పోతే చెప్పు. బయట ఆరు రూపాయలిచ్చేవాళ్ళున్నారు'' అప్పించ్చే వ్యక్తి బెదిరింపు. ''అహు ఏదో అడిగానులే తాతా'' నాయన బతిమిలాడే ధోరణి. ''ఎప్పుడిస్తావు'' అప్పు పత్రం రాసేటపుడు రివాజుగా అడిగే ప్రశ్న. ''కార్తీక మాసం వరకి ఇస్తా'' నాయన హామీ. చివర్లో ..

Rs.100.00

Kathala Khajana

ఈ బొమ్మల కథలన్నీ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపా..

Rs.225.00

Pillalu Mechhina 100..

ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలూ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ..

Rs.225.00