ప్రొఫెసర్‌ కర్వాలో రచన కన్నడంలో 40 సార్లు పునర్ముద్రణ పొందింది. ఈ రచన ఇంగ్లీష్‌, హిందీ, మరాఠి, మళయాళం, జపనీస్‌ భాషలలోకి అనువదించబడింది.

ఈ రచనలో కొంతభాగం తేజస్వి గారి ఆత్మకథగానే మనకు కనబడుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏ రంగంలో అడుగిడినా దానిలో పరిపూర్ణతను సాధించిన తేజస్విగారు ఈరచనను రచించి 50 సంవత్సరాలు అయినవి. పర్యావరణంలో సేంద్రియ వ్యవసాయంలో, సాహితీవనంలో అపరిష్కృతమైన చర్చలు, వాదోపవాదాలు జరిగినప్పుడు తేజస్విగారి అనుభవాన్ని పొందేందుకు కన్నడ సమాజం ఎంతగానో ఎదురుచూస్తుండేది. సభలన్నా, సన్మానాలన్నా గిట్టని తేజస్విగారు గ్రామీణ భారతంలో రైతుగా నిలదొక్కుకుంటూ తనకు సేద్యంలో ఎదురైన సంఘటనలను ముఖ్యంగా అట్టడుగున ఉన్న జనుల మనోవైజ్ఞానికతను బహు విపులంగా తన రచనల ద్వారా వెల్లడించారు.

పేజీలు :301

Write a review

Note: HTML is not translated!
Bad           Good