వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ కాల ప్రవాహంలో కొంతమందిని మాత్రమే చరిత్ర, జాతి గుర్తుంచుకుంటుంది.

వారి జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు, మంచి పనులు చేయడం, ఎదుటివారికోసం తమ జీవితాలను పణంగా పెట్టినవారినే మానవజాతి చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది. తరతరాలుగా వారి ఆశయాలు, లక్ష్యాలు శాశ్వతంగా గుర్తుగా జనవాహినిలో నిలిచివుంటాయి.

ఇంతపెద్ద ప్రపంచంలో, ఇంతమంది జనాల్లో ఎక్కడో, ఎవరో మిగతావాళ్ళలా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఉండి, తమ ఆశయాల్ని. పట్టుదలని నిలబెట్టే ప్రయత్నంలో ప్రజా సమస్యలపట్లో, సమాజ శ్రేయస్సుపట్లో జాతిమెరుగు కోసమో సత్ఫలితాలు కలిగేలా ముందుకు సాగారు. అందువల్లే వారు గొప్పవారూ, మహానుభావులు, మహాత్ములు, మహాపురుషులు అయ్యారు. విధిగా అలాంటి వారి జీవిత చరిత్రలు చదువుతూంటే మనమూ ఉత్తేజితులవుతాం.

ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఇలాంటి మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులవుతుంటారు. ఇలాంటివారిని మృత్యుంజయులుగా చెప్పుకోవచ్చు.

అలాంటివారిలో కొంతమంది జీవితంలో చిన్నవయసులో చేసిన గొప్పపనులు, చిలిపిపనులు, అల్లరి చేష్టల గురించి తెల్సుకుందాం!! - రచయిత

పేజీలు : 149

Write a review

Note: HTML is not translated!
Bad           Good