ఈ అవనిపై జన్మించిన ప్రతి మనిషికీ అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రియమైనది, అమితంగా ఇష్టపడేది తన పేరునే. ఎదుటివారు తనని పేరుపెట్టి పిలిస్తే ఏ మనిషైనా పులకించిపోతాడు. స్నేహభావంతో మెలుగుతాడు. తనని పేరు పెట్టి పిలిచినవారికి అమిత గౌరవమిస్తాడు.


అందుకే మనిషికి 'పేరు' అనేది చాలా ప్రాముఖ్యమైనది. 'పేరు'కి అర్థం ఉండాలి. పేరులో కంపనము ఉండాలి. పేరులో శబ్దకంపనము వల్ల మనిషి యొక్క మెదడు ఉత్తేజపడుతుంది. పేరులోని శబ్దకంపనమే మనిషి మనుగడ గమనమెలా ఉండాలో తెలియజేస్తుంది లేదా సూచిస్తుంది.


రోజూ మీరు టీవీల్లో జాతక ప్రముఖ ప్రకటనలు వింటూనే ఉంటారు కద. ఆ ప్రకటనల్లో 'శబ్దతరంగాలని' బట్టి పేర్లు పెట్టడంలో దిట్ట, ఫలానా ఆయన ఎందరికో ''శబ్ద తరంగాలననుసరించి పేర్లు పెట్టారు లేదా మార్చారు. ఎంతోమందికి లాభం చేకూరింది'' అని వింటూ వుంటారు కదా. అది నిజమే. ఆ శబ్దతరంగాలనే నేను 'కంపనము' అని ఉచ్చరించాను.


ఎన్నో శబ్ధరత్నాకర గ్రంథాలనూ, పదకోశములనూ, అమరకోశములనూ, పురాణ గ్రంథాలను పరిశీలించి తెలుగువారికి సరిపోయేలా 'కంపనలను ఉత్పత్తి చేసే అర్థవంతమైన వందలాది పేర్లను సేకరించి ప్రచురించటం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good