Rs.50.00
In Stock
-
+
ఇవి నెల్సన్ మండేలా మెచ్చిన కథలు ఆఫ్రికా నలుమూలల నుంచీ సేకరించిన జానపద కథలు, కథలో ఏనుగులొస్తాయి. దుమ్ములగొండులు వస్తాయి. సాలీళ్లు వస్తాయి. పాములూ వస్తాయి. కుందేళ్లు వస్తాయి. గుంట నక్కలూ వస్తాయి. సింహం రాదా మరి? మనుషులు సరేసరి.
భూమి ఎలా పుట్టిందో ఒక కథ చెబుతుంది. ఇంకా ఎన్నెన్నో సంగతులు ఈ కథలు చెబుతాయి. ఇది ఆఫ్రికా ఉమ్మడి సంపద. ఇప్పుడు ఆ సంపద ద్వారాలు తెలుగు పిల్లల కోసం తెరుచుకొన్నాయి. అందులో దూరాలనుకొనే పెద్దలకూ స్వాగతం. రండి. దూరండి మరి ఆలస్యం ఎందుకు?
''ఆఫ్రికాలో కథకుడి స్వరం ఎన్నటికీ మూగబోరాదని నే కోరుకుంటాను. ప్రపంచంలో బాలలందరూ పుస్తకాల అద్భుతాన్ని అనుభవించాలన్నది నా కోరిక.'' - నెల్సన్ మండేలా
పేజీలు : 112