పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్‌ఫోన్‌కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గేములు, వీడియోలుకే పరిమితమైపోతున్నారు. సొంత ఆలోచనలకు అవకాశం లేకుండా, తల్లిదండ్రులు ఏం మాట్టాడినా పట్టించుకోకుండా ఫోన్‌లో నిమగ్నమైపోతున్నారు. బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్‌ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోన్‌ను వాడడం మానుకోలేక, పిల్లలకు దూరంగా ఉంచలేక తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ఇదే ఆలోచనతో కో.మా.కో.ఇళంగో 'జీమా మొబైల్‌' పుస్తకాన్ని రాశారు. ఈ చిన్న పుస్తకం చిన్న పిల్లలకు ఆసక్తికరంగాను, ఆలోచింపజేసేదిగాను, విజ్ఞానం, క్రమశిక్షణ పెంపొందించేదిగాను ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

పేజీలు : 59

Write a review

Note: HTML is not translated!
Bad           Good